Nov 22,2019 07:58PM
హైదరాబాద్: నగరంలోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్ టెర్రస్ పైనుంచి పడి యువతి తీవ్రంగా గాయపడింది. తలకు బలమైన గాయం కావడంతో కుటుంబ సభ్యుల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. మృతురాలు ముక్కదల శ్రీనివాస్ కూతురు అయుశిని(20)గా గుర్తించారు. గోకరాజు రంగారాజు కాలేజీలో బీఫార్మసీ చదువుతుంది.