Nov 23,2019 06:50AM
శ్రీశైలం: కార్తీకమాసం చివరి ఆదివారం, సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి అధికసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ రెండు రోజులు ఆర్జినత సేవలు నిలిపివేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్.రామరావు తెలిపారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని ఈవో చాంబర్లో దేవస్థానం ప్రధాన అర్చకులు, స్థానాచార్యులతో పాటు అన్ని విభాగాల అధికారులు, శ్రీశైలం సీఐతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కార్తీకమాసం చివరి ఆదివారం, సోమవారాల రద్దీ దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేయాలనే నిర్ణయాలు తీసుకున్నారు.