Dec 02,2019 09:13PM
వరంగల్: గిరిజన మైనర్ విద్యార్థిని పై ఆర్ఎంపీ వైద్యుడి అత్యాచార యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హనుమకొండ జులైవాడ ఎస్టీ హాస్టల్ లో చదువుకుంటున్న 14 ఏళ్ల విద్యార్థిని కళ్ళలో నీరుకారుతుంటి..ఆమె స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు రాజును శుక్రవారం రోజు సంప్రదించింది. బాలికను పరీక్షించిన వైద్యుడు రాజు ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నట్లు నటించి మత్తుమందు ఇచ్చి విద్యార్థిని పై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు వదిలిన అనంతరం విషయాన్ని గ్రహించిన సదరు విద్యార్థిని ఏడ్చుకుంటూ హాస్టల్ కి వెళ్ళిపోయింది. ఆతరువాత ఫోన్ లో ములుగు జిల్లాలో ఉండే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. సుబేదారి పోలీసులకు పిర్యాదు చేయడంతో నిందితుడు రాజు పై పోక్స్ యాక్ట్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.