మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో కరోనా కేసుల కలకలం రేపుతోంది. ముంబై నుంచి కంఠాయపాలెం వచ్చిన వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. గర్భిణి సహా ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేల్చారు. ఈ నేపథ్యంలో కంఠాయపాలెం గ్రామాన్ని కలెక్టర్ గౌతమ్ సందర్శించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీకి కరోనా పాజిటివ్ రావడంతో తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామంలో రెండు రోజులుగా ఇంటింటికి వైద్య సిబ్బందితో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంఠాయపాలెం గ్రామానికి ఇటీవల మహారాష్ట్ర నుంచి దంపతులు రాగా, భర్త అనారోగ్యంతో మృతి చెందగా, భార్యకు పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ వచ్చింది. దీంతో వారితో ప్రయాణం చేసిన, కలిసిన అందరికీ 13 వైద్య బృందాలతో ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm