తపన.. సాహసం.. నిరంతర అధ్యయనం.. దూసుకుపోయేతత్వం...
ఇప్పటి జర్నలిజానికి ఎంతో అవసరం. సమాజంలో జరిగే పరిణామాలు, విన్నదీ కన్నదీ పదిమందితో పంచుకోవాలనుకునే వారి సంఖ్య అధికమైంది. అందువల్లనే కోర్సులతో సంబంధం లేకుండా రాణించాలనుకునేవారు జర్నలిజం వృత్తిని అధిక సంఖ్యలో ఎంచుకుంటున్నారు. నూతన రాష్ట్రంలో ఉగాది పర్వదినాన జనం ముందుకొచ్చిన నవతెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రిక ఇప్పుడు జర్నలిజం కళాశాలను నిర్వహిస్తోంది. అధ్యయనం పట్ల నిరంతరం ఆసక్తి కనబరిచేవారిని పరిపూర్ణమైన జర్నలిస్టులుగా తీర్చిదిద్దేందుకు నవతెలంగాణ జర్నలిజం కళాశాల శ్రీకారం చుట్టింది. అక్షరాలను శక్తిగా మలిచి ప్రజల పక్షాన నిలిచేందుకు కంకణం కట్టుకుంది.
ప్రతి పదంలోనూ నవ్యత, నాణ్యత, సమగ్రత, సామీప్యత రంగరించి నిజమైన జర్నలిజానికి నాంది పలకనుంది. అక్షరాలను ఆయుధాలుగా మలిచి సమాజాభివృద్ధిలో తమదైన ముద్రవేయనుంది. సమాజంలోని రుగ్మతలు, మంచీ-చెడుతో పాటు అన్ని అంశాలపై ఆరు నెలల పాటు శిక్షణనిచ్చి అనంతరం ఉద్యోగావశం కల్పిస్తున్నది. వివిధ విభాగాలు, జిల్లా డెస్కులు, రిపోర్టింగ్, ఫీచర్స్ తదితర విభాగాల్లో పనిచేసేందుకు అవసరమైన ఆంగ్లభాషా పరిజ్ఞానం, అనువాద సామర్థ్యం, అనుభవం గలవారికి ప్రాధాన్యత ఉంటుంది. శిక్షణ కాలంలో ప్రతినెలా స్టైఫండ్‌తో పాటు వసతి, భోజన సౌకర్యం కూడా జర్నలిజం కళాశాల కల్పిస్తున్నది.