
హైపరాక్టివ్ పిల్లలకు..!
పిల్లలు చాలా కోపంగా ఉన్నారా? గట్టిగా కేకలు వేస్తున్నారా? అల్లరి ఎక్కువగా చేస్తున్నారా.. ఎంత చెప్పినా వినడం లేదా.. అయితే వీరిని హైపరాక్టివ్ పిల్లలుగా చెప్పుకోవచ్చు. ఈ సమస్య ప్రతి ఇంట్లో ఉంటుంది. దీన్నుంచి బయటపడానికి ఒక కొత్తరకం వెస్ట్ (లోదుస్తుల్లా వేసుకునే బనియన్లాంటిది) ను కనిపెట్టారు ఐఐటీ-ఢిల్లీ, ఎయిమ్స్ వైద్యలు. ఆరు నుంచి తొమ్మిదేండ్ల వయసు ఉండే చిన్నారులకు అనువుగా దీన్ని రూపొందించారు. ఈ వెస్ట్ ధరించడం వల్ల హైపరాక్టివ్, ఆటిజం వంటి సమస్యలుండే పిల్లల్లో అతికోపం, అల్లరి అదుపులో ఉంటాయి. తమ పనులు చేసుకోవడంపై మనసుని నిమగం చేస్తారు. ఇలాంటి వెస్ట్లు పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఆరువేల రూపాయలకు లభిస్తాయి. కానీ మన పరిశోధకులు కనిపెట్టిన తాజా వెస్ట్ కేవలం 1000 రూపాయలకే వస్తుందట. అయితే ఇది పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప