
ఆహ్లాదానికి హ్యాంగింగ్ లాంప్స్ ...
వాన కాలపు మబ్బులు, చల్లటి గాలి, పొడి పొడి సూర్యకిరణాలతో ప్రకృతి హాయిగా ఉంటుంది. వాతావరణం మరీ అంత చల్లగా , మబ్బుగా ఉంటే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. అయితే స్నేహితులతో బయట, ఆఫీసు పనుల్లో బిజీగా ఉన్నంత సేపు ఏం అనిపించదు. ఇంట్లోకి రాగానే డల్‌నెస్ ఆవరిస్తుంది. మనసంతా చికాకుగా ఉంటుంది.. ఇలాంటి వాతావరణం నుంచి బయటపడాలంటే మీ ఇల్లును మీకు నచ్చినట్టు తీర్చిదిద్దుకోవాలి. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడూ రోటిన్‌గా కనిపించే బల్బ్‌కు కాస్త మెరుగులు దిద్దండి. దీని కోసం తెలుపు రంగు కాగితాన్ని కింద చూపినట్టు ఇష్టమైన డిజైన్లలో కట్ చేసుకొని వాటి మధ్యలో మీకు నచ్చిన రంగు రంగుల బల్బ్‌లను అమర్చితే సరి. మరెందుకు ఆలస్యం ఓ సారి ప్రయత్నించి చూడండి...