
పలుమార్లు చేస్తే..!
ఆవనూనె సహజమైన ఫ్యాటీ ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఈ నూనె ముఖ్యంగా వెంట్రుకలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఫ్యాటీ ఆమ్లాలు అద్భుతమైన కండీషనర్‌గా పని చేస్తాయి. వెంట్రుకలు ఒత్తుగా, దృఢంగా పెరగడంలో దీని పాత్ర కీలకం.
- ప్రస్తుతం వాతావరణ కాలుష్యం, పని ఒత్తిడి వల్ల వెంట్రుకలు బాగా రాలిపోతున్నాయి. ఈ ప్రభావం వల్ల కురులు నిర్జీవంగా, బలహీనంగా తయారవుతాయి. అలా కాకుండా ఉండాలంటే పోషకాలు అధికంగా ఉండే ఆవనూనెను తరచూ వెంట్రుకలకు పట్టిస్తూ ఉండాలి. ఇలా పలుమార్లు చేస్తే వెంట్రుకలు బలంగా, పొడవుగా పెరుగుతాయి.
- అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజలవణాలు, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్స్ 'ఎ.డి,ఇ, కె', లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వెంట్రుకల పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి.
- కురులు నిర్జీవంగా, బలహీనంగా ఉంటే ఆవనూనెను క్రమం తప్పకుండా వెంట్రుకలకు పట్టించాలి. ఈ నూనెను నెత్తిమీద మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి ఒత్తిడి దూరం అవుతుంది.
- పెరుగులో కొద్దిగా ఆవనూనె కలిపి వెంట్రుకలకు నిండుగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత వేడి నీటిలో టవల్‌ను ముంచి తలకు గట్టిగా చుట్టూకోవాలి. ఇలా 30-40 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరు వెచ్చటి నీటిలో షాంపూ పెట్టి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల కురులు ప్రకాశవంతంగా, మృదువుగా మారతాయి.
- కలబంద గుజ్జులో రెండు చెంచాల ఆవనూనెను కలిపి వెంట్రుకలకు నిండుగా పట్టించాలి. ఇలా 30-40 నిమిషాలు పట్టించాలి. తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా పలుమార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.