బ్రా కేర్‌ టిప్స్‌.. | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిన్యాయ సలహాలు

బ్రా కేర్‌ టిప్స్‌..

ఇన్నర్స్‌.. ప్రత్యేకించి బ్రాల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. తక్కువకు వస్తున్నాయి కదా అని సాధారణమైనవి తీసుకుంటే... అస్సలు బాగోదు. కొద్దిగా ఖరీదు ఎక్కువైనా మంచి బ్రాండెడ్‌ బ్రాలనే కొంటున్నారు. అలాంటి ఖరీదైన బ్రాలు తొందరగా ఖరాబయితే... చాలా బాధగా ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా సమయం వెచ్చించి, మెయింటైన్‌ చేయగలిగితే... బ్రాలు ఎక్కువ కాలం వస్తాయి. ఆ టిప్స్‌ మీకోసం.
బ్రాలు సాధారణంగా మూడేండ్లపాటు మన్నికగా ఉంటాయి. బ్రా కొనేటప్పుడు దానిని ఎలా వాష్‌ చేయాలనే డీటెయిల్స్‌ ఇస్తారు. వాటిని జాగత్తగా చదివి అలాగే పాటించండి.
ఎమూడుసార్లు ధరించిన తరువాత ఒకసారి చల్లని నీటితో ఉతికేయండి. ఉతికిన తరువాత చాలా మంది వాటిని పిండేస్తుంటారు. అలా అస్సలు పిండకూడదు. ట్విస్ట్‌ చేయడం వల్ల పాడయిపోతాయి.
- కొన్నికొన్ని సార్లు ఎంత కొత్త బ్రా అయినా.. ధరించిన తరువాత వాషింగ్‌ మేషీన్‌లో వేసి తీస్తే చాలు.. హుక్స్‌ పోతుంటాయి. ఇది చాలా మందికి ఎదురయ్యే సమస్య. ఎందుకంటే వాషింగ్‌ మెషీన్‌లో ఉండే చిన్న చిన్న సందుల్లో వీటిని హుక్స్‌ ఇరుక్కుపోయి... ఆ హుక్స్‌ విరిగిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే... బ్రాస్‌వాషింగ్‌ మెషీన్‌లో వేసేముందు హుక్స్‌ పెట్టి వేస్తే మంచిది.
- కొద్దిగా శ్రమ అనిపిస్తుంది కానీ బట్టలన్నీ వాషింగ్‌ మెషీన్‌లో వేసినా... బ్రాలు మాత్రం చేతుల మీదుగానే ఉతికేయండి. మీరు ఐదు నిమిషాలు వెచ్చించ గలిగితే చాలు... అది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ఎంతో ఖరీదు పెట్టి కొన్నది కాబట్టి.. ఆ మాత్రం సమయం కచ్చితంగా కేటాయించాల్సిందే.
- లేదు ఆ మాత్రం సమయం కూడా దొరకడం లేదంటే.. బ్రా వాషింగ్‌ బ్యాగ్స్‌ దొరుకుతున్నాయి. ఆన్‌లైన్‌లో దొరికేవన్నీ అవసరమైనవేం కావు అనుకుంటారు చాలా మంది. కానీ.. ఎక్కువ పైసలు పెట్టిన బ్రాలను కాపాడుకోవాలంటే మాత్రం కచ్చితంగా కొనాల్సిందే. ఆ బ్యాగ్‌లో వేసి.. వాషింగ్‌ మేషిన్‌లో వేస్తే సరిపోతుంది.
- ఇన్నర్స్‌ దాదాపు హౌజెరీ క్లాత్‌లోనే ఉంటాయి. వాటికి కచ్చితంగా ఎలాస్టిక్‌ ఉపయోగిస్తారు. అలాంటి వాటిని మురికి, క్రిములు పోవాలని చాలామంది వేడినీటితో ఉతుకుతుంటారు. కానీ... దీనివల్ల ఎలాస్టిక్‌ పాడువుతుంది. కొద్దికాలానికి బ్రా కూడా పాడైపోతుంది. కాబట్టి.. వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.
- బట్టలు ఆరబెట్టే డ్రయ్యర్‌లో కూడా వేయకండి. అందులోని వేడి.. ఎలాస్టిక్‌తోపాటు.. వైర్స్‌ను పాడు చేస్తుంది. బ్రా మన్నిక కాలం తగ్గిపోతుంది. బ్రాలు ఉతకడానికి మైల్డ్‌ డిటర్జెంట్‌ ఉపయోగించండి. బ్లీచ్‌ అస్సలు వేయకూడదు. ఇది బ్రాలోపలి వైర్‌ను, ఫ్యాబ్రిక్‌ను పాడు చేస్తుంది.

MORE STORIES FROM THE SECTION

fhm-snake

న్యాయ సలహాలు

పట్టువిడుపులుండాలి!

18-08-2019

ప్రస్తుత కాలంలో పిల్లలంతా చాలా స్పీడ్‌గా ఉంటున్నారు. చదువుల్లోనూ, ఆట పాటల్లోనూ చాలా ఫాస్టుగా ఉంటున్నారు. అదే స్థాయిలో అల్లరి కూడా ఉంటుంది. అలాంటి సమయాల్లో పిల్లల్ని నియంత్రించలేక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటుంటారు. దీంతో కోపంతో పిల్లలపై

fhm-snake

న్యాయ సలహాలు

కత్తితో దాడి చేసినప్పుడు..!

17-08-2019

హాస్టల్‌లో చొరబడి అమ్మాయిలను కత్తితో బెదిరించి దాడిచేయడానికి ప్రయత్నించిన సంఘటన వార్తల్లో వచ్చింది. ఆయుధంతో బెదిరించి దాడికి పాల్పడినప్పుడు ఏ విధంగా తప్పించుకోవచ్చో ఈరోజు తెలుసుకుందాం.

fhm-snake

న్యాయ సలహాలు

బ్యాలెన్స్‌ తప్పనిసరి..!

12-08-2019

స్వాతి ఒక చేత్తో హడావుడిగా బాక్స్‌ల్లో భోజనం పెడుతుంది. మరో చేత్లో సెల్‌ఫోన్‌ పట్టుకుని పాపను జాగ్రత్తగా తీసుకువెళ్లమని ఆటోడ్రైవర్‌తో మాట్లాడుతుంది. చకచకా టిఫిన్‌ బాక్స్‌ బ్యాగ్‌లో పెట్టుకుని ఆఫీస్‌కు బయలుదేరింది. బస్టాప్‌కు నడుస్తూనే

fhm-snake

న్యాయ సలహాలు

నేనున్నాననే భరోసా చాలు!

24-07-2019

''ఆత్మహ్యత్మ అనే పదం రోజూ పేపర్లలో, టీవీలలో చూస్తుంటాం... చిన్నచిన్న విషయాలకే మనస్థాపం చెంది ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు ఎన్నెన్నో. మొన్నటికి మొన్న ఒక 8వ తరగతి పాఠశాల విద్యార్థి క్లాస్‌ రూం

fhm-snake

న్యాయ సలహాలు

పదికాలాలు పదిలంగా!

22-07-2019

పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. కానీ ఆ పంట, ఫలాలు అందించకుండానే ఎండిపోతోంది. వైవాహిక బంధంలో భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలు, తగవులు వస్తుంటాయి. అవన్నీ తామరాకుపై నీటి బొట్టు

fhm-snake

న్యాయ సలహాలు

పిల్లలకు డబ్బు విలువ తెలపండిలా...

07-07-2019

ప్రస్తుత కాలంలో మనిషిని నడిపిం చేది డబ్బే. ఏ పని జరగాలన్నా డబ్బు కావాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఆ డబ్బు విలువ తెలుసుకోవడం చాలా అవసరం. ప్రతి ఇంట్లో.. ఆర్థిక ప్రణాళికలు

fhm-snake

న్యాయ సలహాలు

అమ్మాయిని అడ్డుకుంటే..!

06-07-2019

ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని వెంటపడి వేధించడమే కాకుండా ఆ అమ్మాయిని ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన ఒక వ్యక్తిని ఏ విధంగా

fhm-snake

న్యాయ సలహాలు

పిల్లల్లో విజ్ఞానం పెంచాలంటే..

24-06-2019

పిల్లల్లో విజ్ఞానం పెంచాలంటే కేవలం బడికి పంపడమే కాదు... తల్లిదండ్రులుగా అదనంగా చేయాల్సిన పనులూ మరికొన్ని ఉన్నాయి.పిల్లల్ని గ్రంథాలయాలకు పంపడం మొదలుపెట్టడం. అక్కడ కూర్చుని కాసేపు చదువుకునేలా చూడండి. బోలెడన్ని పుస్తకాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి

fhm-snake

న్యాయ సలహాలు

ప్రణాళికతోనే పరిష్కారం

21-06-2019

వర్కింగ్‌ ఉమెన్‌కు ఎన్నో సమస్యలు. ఆఫీసులో పని, ఇంట్లో పని చేసుకోలేక సతమతమవుతుంటారు. దీనివల్ల ఒత్తిడి. ఈ ఒత్తిడి ప్రభావం పని మీదే కాదు,

fhm-snake

న్యాయ సలహాలు

కాలేజీలో చేరారా?

17-06-2019

బడి వాతావరణం అమ్మ ఒడిలాంటిది. కాలేజీ కొచ్చాక ఆ ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. విద్యార్థినులు రెక్కలొచ్చిన పక్షుల్లా విహరిస్తుం టారు. ఆ క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకొని స్నేహితుల్ని ఎంపిక చేసుకోవాల్సిఉంటుంది. అందుకు ఎలాంటి సూచనలు పాటించాలంటే..