అప్పు తీసుకుంటాన్నా‌రా? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిడబ్బు - పొదుపు

అప్పు తీసుకుంటాన్నా‌రా?

అప్పుడప్పుడు డబ్బు.. అత్యవసరంగా కావాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మనకున్న ఏకైక మార్గం పర్సనల్‌ లోన్‌. పెండ్లి, విహార యాత్ర, వైద్య చికిత్స, ఏదైనా కొనాలనుకున్నా.. స్వల్పకాలిక అవసరాల కోసం దీన్ని మించిన ఉపాయం మరోటి లేదు. అప్పు తీసుకునేటప్పుడూ, దాన్ని తిరిగి చెల్లించే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అప్పుడే ఆ అప్పు మీకు భారం కాకుండా ఉంటుంది.
- పర్సనల్‌ లోన్‌ చాలావరకు... ఎలాంటి తాకట్టు, హామీలు లేకుండానే ఇస్తారు. కాబట్టి, బ్యాంకు మీ గత రుణాలకు సంబంధించిన చెల్లింపులను నిశితంగా పరిశీలిస్తుంది. దీనికోసం చూసేది క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర నివేదిక. అందుకే, వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేసుకునేప్పుడే.. ముందుగా మీ క్రెడిట్‌ స్కోరు ఎంతుందన్న సంగతిని తెలుసుకోండి. ఈ స్కోరు 750కి మించి ఉంటే.. ఈ రుణంలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలూ అందే అవకాశం ఉంటుంది. అధిక మొత్తంలో రుణం రావడంతోపాటు, వడ్డీ కూడా కాస్త తక్కువగానే ఉంటుంది.
- కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల అర్హతలను బట్టి, వ్యక్తిగత, వాహన, గృహ రుణం ఇస్తామంటూ హామీ ఇస్తుంటాయి. ఎంత మొత్తం ఇచ్చేదీ చెబుతాయి. ఇలాంటి ఆఫర్లు ఎంతో శ్రమను తప్పిస్తాయి. అనేకానేక పత్రాలను సమర్పించాల్సిన అవసరమూ ఉండదు. సాధారణ రుణ దరఖాస్తులతో పోలిస్తే, ఇవి వేగంగా పరిష్కారం అవుతాయి. తొందరగా అప్పు చేతికి అందుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. రుణం వచ్చేదీ లేనిదీ అంతిమంగా నిర్ణయించేది బ్యాంకు నియమనిబంధనలే. ముందస్తుగా అనుమతించే రుణ మొత్తం కేవలం మీ క్రెడిట్‌ స్కోరు ఆధారంగా పేర్కొంటారు. కొన్నిసార్లు క్రెడిట్‌ స్కోరులాంటివేమీ లేకున్నా ఈ ముందస్తు అనుమతి లభిస్తుంది. ఒకసారి రుణానికి దరఖాస్తు చేసుకున్నాకే అసలు విషయం తెలుస్తుంది.
- హామీ ఉండే రుణాలతో పోల్చినప్పుడు.. ఎలాంటి హామీ లేని వ్యక్తిగత రుణాలకు వడ్డీ కాస్త అధికంగానే ఉంటుంది. కానీ, వీటి మంజూరులో బ్యాంకులు/రుణ సంస్థల మధ్య పోటీ అధికంగానే ఉంటుంది. అందుకే, ఈ రుణాలపై ఉన్న ఆఫర్లను మనం వదులుకోకూడదు. ఏ బ్యాంకు/రుణ సంస్థ ఎలాంటి ఆఫర్లను ప్రకటిస్తోంది వెతికి చూడాలి. కొన్ని సంస్థలు వడ్డీ రేటులో రాయితీ ఇస్తుంటాయి. మరికొన్ని ప్రాసెసింగ్‌ ఫీజుల్లాంటివి రద్దు అంటుంది.. వడ్డీ రేటు అరశాతం తగ్గినా కొంత ఊరటే కదా.. అప్పు అవసరం అయ్యిందని తొందర పడొద్దు.. కాస్త ఓపిక చేసుకొని, అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ విశ్లేషించుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారాన్ని వినియో గించుకోవచ్చు. వడ్డీ రేటు, వ్యవధి ఆధారంగా ఈఎంఐ ఎంత ఉంటుందిలాంటి వాటిని తెలుసుకోవాలి. మీకు ఆర్థికంగా ఇబ్బంది కలగని మేరకు ఈఎంఐని నిర్ణయించుకొని, దానికి తగ్గట్టు వ్యవధిని ఎంచుకోవాలి.
- తక్కువ వడ్డీ రేట్ల కోసం వెతకడంతోపాటు.. చేయాల్సిన మరో పని.. రుసుముల భారం ఎంత ఉందో తెలుసుకోవడం. ప్రాసెసింగ్‌ ఫీజు, స్టేట్‌మెంట్‌ ఛార్జీ, వాయిదాలు సకాలంలో చెల్లించకపోతే అపరాధ రసుము, రుణాన్ని ముందే తీర్చేస్తే వర్తించే రుసుములాంటివన్నీ చూడాలి. ఈ అదనపు ఖర్చుల గురించి తెలుసుకోకుండా.. ముందుకెళ్తే.. అనవసర భారం మోయాల్సి వస్తుంది. సాధారణంగా ఒక ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే రుసుము కాస్త అధికంగానే ఉంటుంది. దీన్ని నివారించాలంటే.. వాయిదా తేదీనాడు బ్యాంకు ఖాతాలో సరిపోయేంత మొత్తం ఉండేలా చూసుకోవడమే. తక్కువ రుసుములు విధించే రుణ సంస్థను ఎంచుకోవడం లోనూ జాగ్రత్తగా ఉండాలి.
- రుణ దరఖాస్తు పత్రంలో ఎన్నో నిబంధనలు ఉంటాయి. చిన్నచిన్న అక్షరాల్లో ఉండే వాటిని చదివి, అర్థం చేసుకోవడం అంత తేలికేమీ కాదు. కానీ, చదివినట్లూ, వాటిని అర్థం చేసుకున్నట్లు మనం సంతకం చేయాల్సి ఉంటుంది. చట్టపరంగా రుణ సంస్థలు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాయి. కానీ, మనమే అప్పు అవసరం ఉన్న తొందరలో కనీస నిబంధనలూ తెలుసుకోం. ఇది సరైన పద్ధతి కాదు.. సంతకం చేసేప్పుడు ప్రాథమికంగానైనా అక్కడ ఉన్న విషయం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రుసుముల విషయాన్ని ఒకటికి రెండుసార్లు చూసుకోండి.

MORE STORIES FROM THE SECTION

fhm-snake

డబ్బు - పొదుపు

మనసుమచ్చే బహుమతి

22-06-2019

తమ ఆప్యాయతనీ, అభినందలనీ తెలియచేసేందుకు చాలామంది బహుమతులనే మార్గంగా ఎంచుకొంటారు. ఇలా బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి ఈనాటిది కాదు. ఎప్పటి

fhm-snake

డబ్బు - పొదుపు

ఆలోచించి కొనండి!

07-06-2019

బట్టి సైజ్‌ను నిర్ణయించుకోండి. ప్రస్తుతం మార్కెట్‌లో బోలెడన్ని రకాల ఓవెన్‌లు దొరుకుతున్నాయి. అందులో బేసిక్‌టైప్‌ అయితే బేసిక్‌ మైక్రోవేవ్‌, గ్రిల్‌తో కూడిన ఓవెన్‌, గ్రిల్‌ అండ్‌ కన్వెన్షన్‌ వంటి మూడు రకాలు అందుబాటులో ఉన్నాయి.

fhm-snake

డబ్బు - పొదుపు

అప్పు ముప్పు తప్పాలంటే..

31-05-2019

ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాంతో అప్పు చేయడం సర్వసాధారణ మయ్యింది. మన అవసరానికి డబ్బు తీసుకొని, దానిని వడ్డీతో సహా కలిపి చెల్లిస్తాం.

fhm-snake

డబ్బు - పొదుపు

ఆన్‌లైన్‌ షాపింగ్‌తో జాగ్రత్త!

10-05-2019

స్మార్ట్‌ఫోన్స్‌ వాడకం పెరిగేకొద్దీ ఆన్‌లైన్‌ షాపింగ్‌కు డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. అయితే దుకాణదారులు ఇచ్చే ఆఫర్స్‌కు అట్రాక్ట్‌ అయి షాపింగ్‌ చేసేముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి.

fhm-snake

డబ్బు - పొదుపు

ఆలోచించి కొనండి

06-05-2019

ఇప్పుడు చాలామందికి షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లటం ఒక సరదా. ఓ లుక్కేసి వద్దాం అనుకుని మాల్స్‌కు వెళ్లి జేబును ఖాళీ చేసుకొని వచ్చే వారు చాలామందే ఉంటారు. ఇలాంటి అనవర ఖర్చును తగ్గించుకోవటానికి కొన్ని టిప్స్‌...

fhm-snake

డబ్బు - పొదుపు

ఆర్థిక జ్ఞానం ప్రధానం...

08-03-2019

ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో మహిళలకు మించినవారు లేరు. కుటుంబపరమైన బాధ్యతలు, ఇతర కారణాలతో వారు డబ్బు నిర్వహణ గురించి అంతగా పట్టించుకోకపోవచ్చేమో. కానీ నేటి మహిళలు ఆర్థిక విషయాలను సులభంగా అర్థం చేసుకుం టున్నారు. కష్టార్జితాన్ని మరింత మెరుగ్గా వినియో గించుకునే పద్ధతులు తెలుసుకుంటున్నారు. సవాళ్లను ఎదుర్కొం

fhm-snake

డబ్బు - పొదుపు

ఆడపిల్లలకు ఆలంబనగా...

25-01-2019

ఆడ పిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని జనవరి 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నది తెలిసిన విషయమే. ఈ పథకంలో ఆడ పిల్లల పేరు మీద వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంవత్సరానికి రూ. 250 మొదలుకుని

fhm-snake

డబ్బు - పొదుపు

ముందు జాగ్రత్త అవసరం

23-11-2018

కావ్య 30 ఏండ్ల వయసులోనే భర్తను పోగొట్టుకుంది. ఐదేండ్ల కూతురిని ఒక్కతే ఉద్యోగం చేస్తూ కష్టపడి పెంచుతుంది. ఒకరోజు సడన్‌గా ఆఫీస్‌ ఎండీ మీటింగ్‌ పెట్టాడు. ఇక తను ఆఫీసు నడిపే పరిస్థితుల్లో లేననీ, మరో రెండు నెలల్లో మూసి వేస్తున్నానంటూ ప్రకటించాడు. పైగా అందరినీ

fhm-snake

డబ్బు - పొదుపు

అధిక వడ్డీకి...

02-11-2018

రోజురోజుకూ.. అటు బ్యాంకు పొదుపు ఖాతాలపైనా.. ఇటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? అధిక వడ్డీ కోసం ప్రత్యామ్నాయ మార్గాలేమున్నాయి? వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం