నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యములో నడుస్తున్న (33) ప్రతిభ కళాశాల యందు (సిఒఇ) 2021-2022 విద్యా సంవత్సరం గాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపిపి,బిపిసి, ఎంఇసి & సిఇసి ప్రవేశాల కొరకు దరఖాస్తు తేదీని సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 20 వ తేదీ వరకు గడువు పొడిగించారనీ సంస్థ నిజామాబాద్ రీజియన్ బిఆర్ ఒ దేవిదాస్ సక్పాల్ సోమవారం విడుదల చేసినఒక ప్రకటనలో తెలిపారు. 2021 సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ,బిసి,హెచ్ సి, కన్వర్టేడ్ క్రిస్టియన్,ఒ సి బాల బాలికల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు.
బోధన ఆంగ్ల మాద్యమున ఉండును,
దరఖాస్తు చివరి తేదీ : 20-01-2021
ప్రతిభ (సిఒఇ) కళాశాలలో ప్రవేశ పొందిన వారు ఇంటర్ తో పాటు ఐఐటి,ఎన్ ఐటి, పేట్, స్లాట్,సిఎంఎ రాష్ట్ర, జాతీయ స్థాయి మొదలగు పోటీ పరీక్షలకు ఉచిత నాణ్యమైన,శిక్షణ తో పాటు చక్కని ఉచిత సదుపాయాలు కల్పించబడుతయని, ఇటువంటి గొప్ప అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సంస్థ బిఆర్ ఒ దేవిదాస్ సక్పాల్ తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు
వెబ్ సైట్: www.tswreis.in
అంతర్జాలం ద్వార
ఆన్లైన్ ఫీజు 100 వంద రూపాయలు కట్టి దరఖాస్తు చేసుకోవాలి తెలిపారు.