నవతెలంగాణ డిచ్ పల్లిజిల్లాలోని ఎడపల్లి మండలంలోని ధర్మారం ఎం గ్రామానికి చెందిన నీరడి లావణ్య 28 కూతురుకు పరీక్ష నిమిత్తం తీసుకొని వచ్చి అదృశ్యం అయినట్లు భర్త నీరడి గంగాధస్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ కుమార్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని ధర్మారం ఎం గ్రామానికి చెందిన రెడీ లావణ్య తన కూతురు స్ఫూర్తిని మండలంలోని ధర్మారం బి గ్రామం లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 9వ తరగతి పరీక్ష రాయడానికి తల్లి, కూతురు కలిసి 9న వచ్చారన్నారు. కూతురు పూర్తి ని పరీక్ష కేంద్రంలోకి పంపించి తల్లి లావణ్య బయటనే కూర్చుని ఉంది మధ్యాహ్న భోజన సమయంలో కూతురు పూర్తిగా బయటకు వచ్చి చూడగా తల్లి కనపడలేదని బయటకు ఎక్కడైనా వెళ్లి ఉంటుందని అనుకొని మళ్ళీ పరీక్ష హాల్లోకి స్పుర్తి వెళ్లి పోయిందన్నారు. తల్లి ఆచూకీ కనబడకపోవడం తో వెంటనే తండ్రి గంగాదాసుకు ఫోన్లో విషయం తెలిపింది. వెంటనే చుట్టాలు, తర్వాత ఇతర చోట్లా ఉండవచ్చని అందరికీ ఫోన్ చేసి తెలుసుకోగా ఎక్కడ రాలేదని అదృశ్యమైనట్లు సోమవారం ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 11 Jan,2021 07:28PM