నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన జెసిబి యజమానులు కలిసి సమావేశం నిర్వహించుకుని మండల యూనియన్ కార్యవర్గాన్ని ఎకగ్రివంగా ఎన్నుకున్నారు.ఇందల్ వాయి మండల అధ్యక్షులు గా గన్నరం గ్రామానికి చెందిన తోట భుమేశ్వర్ ను ఎకగ్రివంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన దర్పల్లి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు గా కోత్త కోరుట్ల కు చెందిన డిశేట్టి రమేష్, సహాయ కార్యదర్శి గా లింగపుర్ కు చెందిన అకుల ప్రసాద్, కోశాధికారిగా ఎల్లా రెడ్డి పల్లి గ్రామానికి చెందిన గుర్రాల ప్రసాద్, సలహాదారు లుగా లక్ష్మీ నారాయణ మాల్లాపుర్, మరంపల్లి సుధాకర్ ఇందల్ వాయి,బైకం నరేష్ లింగపుర్ లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షులు తోట భుమేశ్వర్ మాట్లాడుతూ మండలంలో ఉన్న జెసిబి యజమానులు ఏకమై యూనియన్ కార్యవర్గాన్ని ఎకగ్రివంగా ఎన్నుకున్నరని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తాము దృష్టికి తీసుకొని రావాలని కోరారు.ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరిని కలుపుకొని ముందుకు వేల్తా మన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Jan,2021 04:13PM