నవతెలంగాణ కంటేశ్వర్
నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ యువజన వారోత్సవాల సందర్భంగా, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో రంగోళి కార్యక్రమం నిర్వహించారు.స్థానిక సుభాష్ నగర్ లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ పోటీలలో జిల్లాలోని వివిధ ప్రాంతాల యువతీ యువకులు పాల్గొన్నారు.సంస్కృతి - సంక్రాంతి అనే అంశం మీద ముగ్గులు వేయాలని సూచించినట్టుగా అందరూ ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారు. విశేషంగా ఈ పోటీలలో ఇద్దరు యువకులు ముగ్గులు వేశారు, వారి ముగ్గులు సైతం చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.విజేతలకు ఈనెల 18వ తేదీన నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర అధికారి చేతుల మీదుగా బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ రేష్మ చంద్రన్ పాల్గొన్నారు.