- సంక్రాంతి పండుగ గా సందర్భంగా భోగి మంటల్లో చట్టాలను తగలబెడుతున్న ప్రజా సంఘాల నాయకులు
నవతెలంగాణ కంటేశ్వర్
సాగు చట్టాలను రద్దు చేయాలని సంక్రాంతి పండగ సందర్భంగా భోగిమంటల్లో చట్టాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సి ఐ టి యు కార్యాలయం వద్ద సంక్రాంతి భోగి సందర్భంగా ఉదయం 10 గంటలకు భోగిమంటల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తగలబెట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు రామ్మోహన్ రావు, పెద్ది వెంకట్రాములు, ఏ రమేష్ బాబు, నూర్జహాన్, లత, విగ్నేష్ లు, మాట్లాడుతూ ఢిల్లీలో కోట్లాది మంది రైతులు గత యాభై రోజుల నుంచి కేంద్రం ప్రభుత్వం బిజెపి తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని. ఆందోళన చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మొండిగా, వ్యవహరిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని ఈ చట్టాలు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా రైతులకు నష్టం కలిగే విధంగా తీసుకొచ్చారని ఆరోపించారు చట్టాలు రద్దు అయ్యేంతవరకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా రైతన్నలు ఐక్యంగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్, ఈ వి ఎల్ నారాయణ , పెద్ది సూరి, శ్రీనివాస్ రాజ్, కటారి రాములు, కృష్ణ , మహేష్, వేణు, మాధవి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Jan,2021 08:26PM