-బిఎల్ఎఫ్ జిల్లా అద్యక్షులు ఎం.శ్యాంబాబు వెల్లడి
నవతెలంగాణ కంటేశ్వర్ తెలంగాణ సమాజంలో 93%మున్న బహుజనులకే రాజ్యాధికారం సాధన లక్ష్యంగా ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ తృతీయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 25న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగానే నేడు అనగా శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నగరంలోని బిఎల్ఎఫ్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు బిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం శ్యాంబాబు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో శివాజీ నగర్ లోని బహుజన బీడీ కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్.సిద్దిరాములు మాట్లాడుతూ 93%మున్న బహుజనుల సమస్యలు పరిష్కారం కావాలంటే బహుజనులు అధికారంలోకి వచ్చినప్పుడే పరిష్కారమవుతాయన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బిఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ లు కర్రొల్ల శ్రీనివాస్,జన్నేపల్లి సత్యనారాయణ, నగర నాయకులు కామ్లే మధు, కె.గంగాధర్ లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 02:01PM