నవతెలంగాణ కంటేశ్వర్
ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార కామ్రేడ్ జార్జి రెడ్డి ఉద్యమస్ఫూర్తితో నూతన జాతీయ విద్యా విధానం-2020 ని రద్దు చేసేంతవరకు విద్యార్థి లోకం పోరాడాలని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పి డి ఎస్ యు వ్యవస్థాపకులు కామ్రేడ్ జార్జి రెడ్డి 74 వ జయంతిని జిల్లా కేంద్రంలో లో నీలం రాం చంద్రయ్య భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు నగర కమిటీ ఆధ్వర్యంలో పూల మాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ కామ్రేడ్ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యారంగ సమస్యలపై ,సామాజిక ఆర్థిక అసమానతలపై పోరాడిన వ్యక్తి అని. యూనివర్సిటీ లో జరిగే అన్యాయలపై అధికారులను, మతోన్మాద ఆగడాలను ప్రశ్నించారనిఅనేక మంది విద్యార్థులను విప్లవ మార్గంలో ప్రగతిశీల శక్తులుగా తయారు చేశారని తెలిపారు.
నేడు దేశంలో నూతన జాతీయ విద్యా విధానం పేదలకి విద్య మరింత దూరం చేసేదిగా ఉందని. విద్యను ప్రైవేటు కార్పొరేటు విదేశీ శక్తులకు అప్పగించడం అవుతుందని. విదేశీ యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం అంటే స్వదేశీ యూనివర్సిటీలను గాలికి వదిలేయడమేనని. కేంద్ర కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విద్యకు ప్రతిసారి 5% మించి నిధులు కేటాయించడం లేదని గ్రామీణ ప్రాంత విద్యార్థుల చదువుకు ఆటంకం అవుతున్న ఆర్థిక సామాజిక అంశాలను పరిష్కరించకుండా విద్యావ్యవస్థలో మార్పు తెచ్చిన శూన్యమేనని. నూతన విద్యా విధానాన్ని పరిశీలిస్తే కమ్యూనల్, కార్పొరేట్,సెంట్రలైజేషన్, ప్రైవేటైజేషన్ చేయడం కోసమే రూపొందించారని. కావున ఈ నూతన విద్యావిధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు జాదవ్ సాయికృష్ణ నగర నాయకులు పవన్ .నవీన్. ప్రవీణ్. దేవిక మరియు యువ.ధ్రువ లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 02:08PM