నవతెలంగాణ దోమకొండ
అయోధ్య లో శ్రీ రామ జన్మ భూమి ఆళయ నిర్మాణానికి ప్రతి ఇంటి నుండి రూపాయి మొదలుకొని,ఎంతైనా ఇంటింటికి డబ్బులు ఇవ్వాలని శ్రీరామ జన్మ భూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ జిల్లా సమితి సభ్యులు కదిరె లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆళయ ఆవరణలో శ్రీ రామ జన్మ భూమి తీర్దక్షేత్ర ట్రస్ట్ ఆద్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క ఇల్లు తన వంతుగా ఆళయ నిర్మాణానికి నిదులు ఇవ్వాలని,ప్రతి ఇచ్చిన డబ్బుకు రసీదు అందజేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా హిందువులందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నిదుల సేకరణ విషయమై ఈ నెల 16 న శనివారం సాయంత్రం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ సమావేశంలో నల్లపు శ్రీనివాస్, గజవాడ శ్రీకాంత్, నాగరాజు రెడ్డి,బొమ్మెర శ్రీనివాస్, బుర్రి రవికుమార్, పాలకుర్తి శేఖర్, మోహన్ రెడ్డి,పున్నలక్ష్మణ్,శరత్ శర్మ,రాజు,రవి,వంశి,వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 03:01PM