నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్వాయి మండలం కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ముదిరాజులను గంగపుత్రులలో సభ్యత్వం ఇవ్వడంపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఇందల్ వాయి గంగపుత్ర సంఘం అద్వర్యంలో దిష్టిబొమ్మను శుక్రవారం ఇందల్ వాయి మండల కేంద్రం లోని బస్టాండ్ వద్ద దగ్ధం చేశారు. చెరువులపై పూర్వం నుంచే గంగపుత్రులకు పూర్తి హక్కు ఉందని, ఎన్నికల ఓట్ల కోసం మత్స్య కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తుందని ఎట్టి పరిస్థితుల్లో ముదిరాజులను మత్స్యశాఖ లో సభ్యత్వం ఇవ్వడం రద్దు చేయాలని గంగపుత్ర యూత్ అధ్యక్షుడు భాస్కర్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ముదిరాజ్ కులస్తులకు వత్తాసు పలుకుతూ 80 ఏళ్ల నుండి చెరువులపై పూర్తి హక్కు మత్స్య కార్మికులకు ఉంటుంది మత్స్య శాఖ నుండి ప్రతి సంవత్సరం చెరువు తహసిల్ ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుందని గత పూర్వం నుంచి చెరువులపై పూర్తి హక్కు కార్మికులకే ఉంటుందని గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలుసుకోవాలని ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
గత కొన్ని ఏండ్ల నుండి గంగపుత్రులు చేపల వృత్తిలోనే కొనసాగుతున్నారని, గ్రామాలలో ముదిరాజులు పండ్లు, మామిడి కాయలు, జామకాయలు అమ్ముకుని జీవనం సాగించే వారని ఉన్నఫలంగా వారికి చెరువులు ఏ విధంగా అప్పగిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్ల ఓట్ల కోసం కుల రాజకీయాలు చేస్తుందని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ మారంపల్లి రమేష్, గంగ యువజన సంఘం అధ్యక్షులు వెల్లుల్ల భాస్కర్,, దేగం పోచయ్య, మైస గంగాధర్, భాగీరథి నారాయణ, మారంపల్లి వినోద్, దేగం భరత్, నిఖిల్, మొక్క బోయి దినేష్, మారంపల్లి శ్రీకాంత్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు గంగపుత్ర యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 03:17PM