- జిల్లాలో బడ్ ఫ్లూ లక్షణాలు లేవు
- జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ భారత్
నవతెలంగాణ డిచ్ పల్లి
గత మూడు రోజుల క్రితం మండలంలోని యానం పల్లి తాండ లో 500 కోళ్ళు మృత్యువాత పడిన సంఘటన తెల్సిందే. బుధవారం ఈ సంఘటన వెలుగులోకి రావడంతో జిల్లా పశువైద్యాధికారి ఆధ్వర్యంలో కోళ్ల ఫారం వద్దకు చేరుకొని మృతిచెందిన బతికి ఉన్న సేకరించి పంపించారు దానిలో భాగంగానే పశు వైద్య పరిశోధన సంస్థ( వెటర్నరీ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) హైదరాబాద్ డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి ,డాక్టర్ శిరీష, డాక్టర్ కోటి నాగు లోఫార్మ్ ను సందర్శించి రక్త నమూనాలను సేకరించారు. సందర్భంగా జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఎం బారత్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పోల్ట్రి రెైతులు జీవ భద్రత చర్యల్లో భాగంగా తమ పౌల్ట్రీ ఫారం లోనికి శక్తులను వాహనాలను అనవసరంగా లోనికి అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని అత్యవసరం అయితే తప్ప అలాంటి వ్యక్తులను వాహనాలను తగు జాగ్రత్తలు తీసుకొని అనుమతించాలని సూచించారు . అకస్మికంగా కోళ్లు మేత పడినట్లయితే సంబంధిత అధికారికి వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. జిల్లాలోని ప్రజలు లకు కొన్ని సూచనలు చేశారు ఇప్పటి వరకు ఈ వ్యాధి నిర్ధారణ కాలేదని కోడిమాంసం, గుడ్లు 75% ఉడికించి అభ్యంతరంగా తినవచ్చని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 22 ర్యాపీడ్ రెస్పాన్స్ టీంలను శిక్షణ ఇచ్చి సిద్ధం చేయడం జరిగిందని ఈ బృందాలు జిల్లాలోని పౌల్ట్రీ ఫారాలను ఆకస్మికంగా సందర్శించి తగు సూచనలు సలహాలను ఇస్తూంటారని వైద్యాధికారి డాక్టర్ భారత్ అన్నారు. ఎక్కడైనా ఆకస్మికంగ కోళ్లు మృత్యువాత పడినట్టు అయితే వెంటనే సమాచారం అందజేయలని వివరించారు.మృతి చెందిన, ప్రాణంతో ఉన్నవాటి నుండి సేకరించిన నమూనాలను రిపోర్టు కోసం మెటర్నిటీ బయలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ హైదరాబాద్ నుండి వచ్చినవెంటనే ప్రజలకు అన్ని విషయాలు తెలపడం జరుగుతుందన్నారు.
మండల పశువైద్యాధికారి డాక్టర్ గోపి కృష్ణ ఆధ్వర్యంలో పశు వైద్య అధికారులతో కలిసి శుక్రవారం మండలంలోని పలు గ్రామాలలో కోళ్ల మృతి ఇతర వివరాలను సేకరిస్తున్నామని డాక్టర్ గోపికృష్ణ విలేకరులకు తెలిపారు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరగలేదని ప్రజలు కూడా అనవసరంగా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు . జిల్లా సహాయ సంచాలకులు డాక్టర్ బాలిక్ అహ్మద్, డాక్టర్ కిరణ్ దేశ్పాండే, వైద్య సిబ్బంది ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 03:21PM