నవతెలంగాణ కంటేశ్వర్
నగరంలోని లక్ష్మీ గణపతి ఆలయం లో హాట్ ఫుల్ యువర్స్ గ్రూప్ సభ్యుల ని బీజేపీ నేత ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కోవిడ్ వ్యాక్సిన్ అవగాహన సదస్సులో భాగంగా ఇందూరు నగరం నుండి భద్రాచలం వరకు పలు గ్రామాల మీద గా అవగాహన కార్యక్రమాలు నిర్వయిస్తూ సైకిల్ యాత్ర విజయవంతం గా పూర్తి చేసికొని ఇందూరు నగరానికి విచ్చేసిన హాట్ ఫుల్ యువర్స్ టీమ్ కి అభినందనలు తెలియచేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమన్ని ముందుకి తీసుకెళ్లిన గ్రూప్ కన్వీనర్ డాక్టర్.వెంకటరమణకి లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ మరియు ధన్ పాల్ లక్ష్మీ భాయ్ విట్ఠల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచాల జ్ఞానెందర్, మామిడి సంతోష్, అశోక్ గౌడ్,ముక్క ప్రతాప్,వినోద్ గుప్తా,అశోక్ సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 04:07PM