మొక్కై వంగనిది మానై వంగునా అన్న నానుడి నిజం అనిపిస్తుంది. మంచిని స్వీకరించి చెడును విసర్జించు అన్నారు పెద్దలు, మంచి మార్గాలు యువత ప్రయాణించాలి, అది చిన్ననాటినుండే బీజం పడాలి. దీనికోసమే తల్లిదండ్రులు ఆధారపడాలి.దేశానికి శక్తి యుక్తి యువత, యువత దారి తప్పితే దేశా భవిష్యత్తుకి పెను ప్రమాదం, జీవితంలో అల్లరి ఉండాలి కానీ, జీవితం అల్లరిపాలు కాకుండా చూసుకోవాలి. శృతిమించితే యువతకి కాకుండా తల్లిదండ్రులకు, దేశ భవిష్యత్తుకు పెను ప్రమాదం తెచ్చిపెడుతుంది. రోజురోజుకు పెరిగిపోతున్న విపరీత అరాచకాలు, అసాంఘిక కార్యక్రమాలలో యువత ముందంజలో ఉంటుంది. విద్యార్థి దశ నుంచిలక్ష్యం ఎంచుకోని నడవకుండా మంచి మార్గం ఎంచుకొని నడవకుండా.పెడదోవ పడుతోంది. వారి భవిష్యత్తు నాశనమై సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. కన్న వారికి సైతం ఆవేదన మిగులుస్తున్నారు. ఎంజాయ్ పేరుతో చెడు అలవాట్లకు బానిస అవుతున్న యువత అల్లరి శృతిమించితే తిప్పలు తప్పవు ఆత్మవిశ్వాసంతో యువత ముందుకు సాగాలని నిపుణుల సూచన దేశానికి అసలైన శక్తి యుక్తి యువత అలాంటి యువత దారి తప్పితే దేశ భవిష్యత్తుకే పెను ప్రమాదం. లక్ష్య సాధన పైన ధ్యాస ఉండాలి. చదువుకున్న యువత అయినా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువత అయిన తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ధ్యాస ఉండగలిగితే సులువుగా గమ్యం చేరుకోవచు. ఎంజాయ్ పేరుతో మద్యం, ధూమపానం, గుట్కా, పేకాట వంటి వ్యసనాల బారిన పడి ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంజాయ్ పేరుతో చెడు అలవాట్లకు లోనై వాటికి బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును బలి చేసుకుకుంటున్నారు. అందుకే చెడు ఆసనాలకు దూరంగా ఉండటం ఉత్తమం. పేకాట. వ్యభిచారం. వంటి అసాంఘిక కార్యకలాపాళతో సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నారు. అలాంటి వాటి జోలికి వెళ్లడమేకాదు అలాంటి పనులకు అలవాటు పడిన స్నేహితులకు దూరం ఉండడమే ఉత్తమం.
లక్ష్య సాధన వైపు ధ్యాస ఉండాలిచదువుకున్న యువత అయినా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత అయినా తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం నిరంతర కృషి ఉండాలి అలా అయితే సులభంగా గమ్యాన్ని చేరుకోవచ్చు విశాల దృక్పథంతో ఆలోచన చేయాలి. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం సమాజం గురించి అవగాహన పెంచుకోవామ్ అవసరం లక్ష్యాన్ని సాధించుకునే క్రమంలో కష్టాలు ఎన్ని వచ్చినా ముందుకు సాగాలి నిర్మలమైన ఆలోచనతో, ఆత్మ ధైర్యం తో లక్ష్యాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తే విజయం తప్పకుండా మీ బారిన పడుతుంది ఇందుకోసం సాధన చేయడమే ఉత్తమైన మార్గం అని మేధావులు. నిపుణులు పేర్కొంటున్నారు. శ్రమిస్తే ఓటమి భయపడుతుంది యువత సంఘాలను ఏర్పాటు చేసి సేవ్ చేయాలి. నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడునట్టు. నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది. పెద్దల అన్నట్టు సూక్తులు నేటి యువతరం పాటించాలి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ముందుకు కదలాలి.
వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి
నేటి యువత తలుచుకుంటే ఏదైనా సాధించుకోవచ్చు. వ్యక్తిత్వ పెంపొందించుకోవడం యువత చెడు ఆలోచనలు విడనాడి నిర్దేశించుకున్న లక్ష్యా సాధనకు అంకితమై ముందుకు కదిలితే తప్పకుండా విజయం సాధించవచ్చు.