నవతెలంగాణ తాడువాయి
తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజీ వాడి గ్రామంలో సంక్రాత్రి పండుగ ఈ సందర్భంగా గ్రామంలో మూడు రోజుల పాటు ఆటల పోటీలను గ్రామపంచాయతీ పాలకవర్గం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కురెల్లి జ్యోతి ఈ పోటీలను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ గ్రామం సంక్రాంతి సంబరాల సందర్భంగా యువకులకు క్రీడా పోటీలను నిర్వహించడం ఎంతో అవసరమని ఆమె అన్నారు. ముందుగా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి అనంతరం ప్రభుత్వ పాఠశాల భవనం లో క్రీడా పోటీలను నిర్వహించారు. క్రీడా పోటీలకు గ్రామంలోని యువకులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బత్తుల రమాదేవి నారాయణ, ఎంపీపీ కౌడి రవి, వైస్ ఎంపీపీ నర్సింలు, గ్రామ ఉపసర్పంచ్ చిన్న గొల్ల రాములు. వార్డు సభ్యులు పాలకవర్గం సిబ్బంది గ్రామస్తులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 04:35PM