నవతెలంగాణ-భిక్కనూర్
హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని మండలంలోని భాగీర్తిపల్లి గ్రామంలో శుక్రవారం వాటర్ డే సందర్భంగా మొక్కలకు గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా ఎంపిడిఒ అనంతరావు నీరు పోశారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, నాటిన మొక్కలను రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి స్వామి, ఉప సర్పంచ్ నర్సింలు, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 06:54PM