నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రానికి చెందిన అమీర్ యువకుడు ఇటీవల రాష్ట్ర క్రికెట్ టీంకు సెలక్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం తెలంగాణ జాగృతి జిల్లా యువజన అధ్యక్షుడు శ్రీ రామ్ వెంకటేష్ అమీర్ ను శాలువా కప్పి సన్మానం చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర క్రికెట్ కు ఎంపికైన అమీర్ జాతీయ జట్టుకు భవిష్యత్తులో ఎంపిక కావాలని, తెలంగాణ జాగృతి తరఫున ఎమ్మెల్సీ కవిత తరఫున ఎప్పుడూ ఎల్లవేళలా సహాయ సహకారం అందజేయడం జరుగుతుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 07:09PM