- గ్రామీణ ప్రాంతాలపై వివక్ష
- శ్రీనివాస్ మెమోరియల్ క్రికెట్ లో టీ సీ ఏ ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ
నవతెలంగాణ కంటేశ్వర్
ఎంతో ప్రసిద్ధి చెందిన క్రికెట్ క్రీడలో ఎంతో ప్రావీణ్యత లు నైపుణ్యత లో ఉన్న గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల పట్ల రుద్రాక్ష గా మారిందని ప్రస్తుతం క్రికెట్ జండా నగరాలకే పరిమితం కావడం చాలా బాధాకరమని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ విమర్శించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిజాంబాద్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో నగరంలోని రాజారామ్ స్టేడియంలో నిర్వహిస్తున్న స్వర్గీయ తూము శ్రీనివాసరావు స్మారక టి20 క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖేల్ భావన సే ఖేలేంగే అనే విధంగా ఉండాలి కానీ నీ గ్రామీణ ప్రాంతాల పై వివక్ష చూపడం సరి కాదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ క్రికెట్ కేవలం హైదరాబాద్ కే పరిమితమై ఉండటం చాలా బాధాకరమని ఆయన తెలిపారు. ప్రస్తుతం వివక్షకు గురవుతున్న గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల ఎదుర్కొంటున్న ఆ లోటును పూరించేందుకు తెలంగాణ క్రి
కెట్ అసోసియేషన్ పరిగెడుతుంది అని ఆయన తెలిపారు. అయితే ప్రీం కోర్టు తీర్పు సైతం అనుకూలంగా న్యాయపరంగా ఉందని ఆయన తెలిపారు. దీనిపై బీ సీ సీ ఐ నిర్ణయం తీసుకోనుందని పేర్కొన్నారు. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణ క్రికెట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం టీ సీ ఏ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మంథని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను గుర్తించడంలో జంటనగరాలు తీవ్ర వివక్షతను చూపుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రయోజకులుగా తీర్చిదిద్దడం క్రమంలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తున్నామని కానీ నీ జంటనగరాల్లో మాత్రం క్రికెట్ ఒక కమర్షియల్ గా మారిపోయిందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను గుర్తిస్తే వారికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని అన్నారు. ఈ దిశగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ ను గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ముందుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆల్ రౌండర్ క్రికెటర్ గా పేరు ప్రసిద్ధి చెందిన శ్రీనివాస్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని తనతో ఎన్నో మ్యాచ్లు ఆడిన సందర్భాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని బ్యాటింగ్ బౌలింగ్ చేసి మ్యాచ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, కార్పొరేటర్లు షకీల్ ముస్త సీన్, ఎజాజ్, సుధీర్, నయీం, గౌరవ శర్మ తదితరులు పాల్గొన్నారు.
మ్యాచ్ ల వివరాలు
మొదటి మ్యాచ్ లో నిజాం సెవెన్ వర్సెస్ బోధన్ లెవెన్ జట్లు తలపడ్డాయి. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన నిజాం లెవెన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం అం బోధన్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేసింది. దీంతో నిజాం లేవెన్ జట్టు 21 పరుగుల తేడాతో గెలుపొందింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో ఎమ్ సి సి వర్సెస్ బిఆర్ లేవేన్ జట్లు తలపడ్డాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఎమ్ సి సి జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బి ఆర్ 11 జట్టు ఏడు వికెట్ల కోల్పోయి 126 పరుగులు చేసింది. దీంతో ఎమ్ సి సి జట్టు 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లకు మొహమ్మద్ రఫిక్ ఎంపైరు గా వ్యవహరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 07:20PM