నవతెలంగాణ కంటేశ్వర్
జెసిఐ ఇందూర్ ఆద్వర్యంలో గురు,శుక్రవారాల్లో రెండు రోజులు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు..గురువారం నిజామాబాదు నగరంలోని ఇంద్రాపూర్ కాలనీలో, శుక్రవారంబృందావన్ అపార్ట్మెంట్ లో సంక్రాంతి సంబరాలు జరిపారు. ఇంద్రాపూర్ కాలనీలో పిల్లలకు ఉచితంగా గాలిపటాలు పంపిణీ చేశారు. రెండు చోట్లా ముగ్గుల పోటీలు నిర్వహించి ఉత్తమంగా ముగ్గులు వేసిన మహిళలు, బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు.. జెసిఐ ఇందూర్ ఉపాద్యక్షులు డాక్టర్ రాజశేఖర్, పూర్వాద్యక్షులు బంగారి వీరబ్రహ్మం,చింతల గంగాదాస్, తిరునగరి శ్రీహరి, మహిళా విభాగం అధ్యక్షురాలు తిరునగరి ప్రసన్న,ప్రోగ్రామ్ చైర్మెన్ కోడూరు శ్రీనివాస్,కార్యదర్శి పెందోని శేఖర్,కోశాధికారి కర్క రమేష్,సహాయ కార్యదర్శి శంకర్,జూనియర్ విభాగం అధ్యక్షురాలు కోడూరు సంకీర్తన ,జెసిఐ మహిళా విభాగం,జూనియర్ విభాగం ప్రతినిధులు సునీత,వెన్నెల,అక్షిత,మృణాలిని,దీపిక, బృందావన్ అపార్ట్‌మెంట్ అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్,మధుసూదన్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 07:27PM