- ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
నవ తెలంగాణ రుద్రంగి
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రుద్రంగి మండల ఎస్ఐ బొజ్జ మహేష్
అన్నారు.అయన శుక్రవారం వాహనల తనిఖీ చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ, మీవాహనాలపై ఉన్న పెండింగ్ చాలన్లను వెంటనే ఆన్లైన్ ద్వారా ప్రభుత్వనికి చెల్లించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్య నేరమని అన్నారు.మద్యం సేవించి వాహనం నడపడం వల్ల మీకు మరియు మీ ముందు వచ్చే వాహనదారులకు కూడా హాని జరిగే అవకాశాలు ఉంటాయని అన్నారు.అలాగే వాహనం నడిపే ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలని లేని యెడల చర్యలు తీసుకుంటామని అన్నారు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని కోరారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారుల పై కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 07:46PM