నవ తెలంగాణ కంటేశ్వర్
భోగి, సంక్రాంతి కనుమ శుభాకాంక్షలతో లోహ్రి పండుగను పురస్కరించుకొని రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నిరుపేదలకు చలి నుండి రక్షణ కల్పిస్తూ బ్లాంకెట్ లను అందజేయడం జరిగింది. స్టేషన్ వద్ద గల నిరుపేదలు, బస్టాండ్ వద్ద గల నిరాశ్రయులకు, వృద్ధులకు బ్లాంకెట్ల అందజేసినట్లు అధ్యక్షులు దర్శన్ సింగ్ తెలిపారు. రోటరీ క్లబ్ నిజామాబాద్ సభ్యులందరూ కలిసి లోహ్రి పండగను బాన్ ఫైర్ ఏర్పాటు చేసుకొని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బాబురావు, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి , రాజేందర్ రెడ్డి, ఆకుల అశోక్, వి.శ్రీనివాసరావు, కమల్ గిల్డ, కమల్ ఇన్నాని, హితెన్ భిమనీ, గురుప్రీత్ సింగ్, జితేంద్ర మలానీ, శ్యామ్ అగర్వాల్, రాజ్ సుబెదర్, మనోజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2021 09:30AM