నవ తెలంగాణ నారాయణఖేడ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వికలాంగుల చట్టాలకు తూట్లు పొడుస్తున్నదనీ, హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భువనగిరి జిల్లాలో జరిగిన ఎన్.పీ.ఆర్.డి రాష్ట్ర 3వ మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులుగా వెంకట్, అడివయ్య ఎన్నికయ్యారు. నారాయణఖేడ్ జిల్లాకు చెందిన ముత్యం బస్వరాజ్ పాటిల్ ను ఉపాధ్యక్షులుగా, బుక్క ఇస్మాయిల్ ను రాష్ట్ర కమిటీ సభ్యులుగా, మహిళ కన్వీనర్ గా సయమ్మ లను ఎన్నుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2021 12:34PM