కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తపేట మండలం పాలెం గ్రామ సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారి పై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఈ నెల 13న తిరుపతి వెళ్లాడు. దర్శన అనంతరం నిన్న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. పాలెం గ్రామ సమీపంలోకి రాగానే బాబా దాబా వద్ద విశ్వనాథ్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారును వెనుక వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వరూప(45) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm