నవతెలంగాణ కంటేశ్వర్
జిల్లాలోని లింగ మార్పిడి ట్రాన్స్ జెండర్ గల లింగ మార్పిడి వ్యక్తులకు లింగ మార్పిడి పరిరక్షణ చట్టం 2020లోని నిబంధనలను ఎనేబుల్ చేయడానికి లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) నిబంధనలను 2020లో సెక్షన్ 6 లేదా సెక్షన్ కింద లింగమార్పిడి వ్యక్తులకు గుర్తింపు సర్టిఫికెట్ గుర్తింపు కార్డు జారీ చేసే విధానాన్ని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖ తెలియజేసింది అని నిజామాబాద్ మహిళా దివ్యాంగుల వయోవృద్ధుల జిల్లా సంక్షేమ అధికారి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తు అందిన తర్వాత లింగమార్పిడి వ్యక్తులు అయినటువంటి గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడానికి జిల్లా కలెక్టర్ లేదా మెజిస్ట్రేట్ కు మాత్రమే అధికారం ఉందని తెలియజేశారు. సాంఘిక న్యాయం సాధికారత విభాగం లింగ మార్పిడి వ్యక్తుల గుర్తింపు సర్టిఫికెట్ లేదా గుర్తింపు కార్డు జారీ చేయుటకు జాతీయ పోర్టల్ ఏర్పాటు చేసింది అని తెలియజేశారు. కావున జిల్లాలో గల లింగ మార్పిడి ట్రాన్స్జెండర్ గల వ్యక్తులకు గుర్తింపు సర్టిఫికెట్ గుర్తింపు కార్డు పొందాలనుకునే వారు ఇట్టి సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అందుకు ప్రభుత్వం ద్వారా ఏర్పాటుచేసిన వెబ్సైట్ నందు నమోదు చేసుకున్న అర్హత గల వారందరికీ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ ద్వారా గుర్తింపు సర్టిఫికెట్ గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు. ఇతర వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి శిశు దివ్యాంగుల వయోవృద్ధుల మహిళా సంక్షేమ శాఖ నిజామాబాద్ లోని అన్ని కార్యాలయ పని వేళల్లో నేరుగా గాని లేదా ఫోన్ నెంబర్ 08462251690 నెంబర్ కు సంప్రదించగలరు అని తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2021 02:50PM