నవతెలంగాణ ఉట్కూర్
ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాముకాటు కారణంగా బాలిక మృతిచెందిన ఈ సంఘటన మండల పరిధిలోని తిప్రస్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేవప్ప- లక్ష్మి దంపతుల కూతురు అనురాధ (17) ఇంట్లో శుక్రవారం రాత్రి నిద్ర పోయింది. రాత్రి దాదాపు 12 గంటల సమయంలో అనురాధకు పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారు వెంటనే నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనురాధ తండ్రి గత పది సంవత్సరాల క్రితమే మరణించారు. తల్లి లక్ష్మి కూతురు అనురాధ కలిసి ఉంటున్నారు. ఇప్పుడు అనురాధ కూడా పాము కాటుకు చనిపోవడంతో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2021 03:28PM