నవ తెలంగాణ :
- అనుమానాలు వద్దు అన్ని పరీక్షల తరువాతనే వాక్సిన్..
- నియోజకవర్గ ప్రజలందరూ వ్యాక్సినేషన్ కోసం సహకరించండి.
- ఎమ్మెల్యేబాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి..
వాక్సిన్ లు మానవ కళ్యాణం కోసమేనని.. దీనిపై ఎలాంటి ఆందోళనలు, అనుమానాలు వద్దని అన్ని పరీక్షల తరువాతనే ఇలాంటి వాక్సిన్ సిద్ధం చేసి అందజేయడం జరుగుతుందని నియోజకవర్గ ప్రజలందరూ వ్యాక్సినేషన్ కోసం సహకరించలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేబాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన కోవిడ్ - 19 పంపిణీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ లు కలిసి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. భారత ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వాక్సిన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ లో ముఖ్యమైన అంశాలు ఉన్నాయని, మొదటి డోసు వేసుకున్న 28 రోజుల తరువాత రెండవ డోసు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డోసులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సిబ్బందికి సరిపోతాయని, మరిన్ని డోసులు అందిన తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు.. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కోమార్బిడిటీస్ ఉన్న వారికి, 50 సంవత్సరాల పైబడిన వారికి వాక్సిన్ ఇస్తామని తెలిపారు.
వ్యాక్సిన్ పనిచేస్తుందా? లేదా? అనే ఆందోళన వద్దు..
వాక్సిన్ పట్ల ఎవరూ.. భయపడవద్దని,శాస్త్ర బద్దంగా అన్ని పరీక్షల తరువాతనే డిసిజిఐ వాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. భారత్ బయోటెక్ వాక్సిన్ 3వ రౌండ్ ట్రయల్స్ నిమ్స్ లో నడుస్తుందని,అవి పూర్తి కాగానే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,213 కేంద్రాలు సిద్దం చేసామని, వాక్సిన్ వేసిన తరువాత అరగంట పాటు పరిశీలనలో ఉండాలని, అందుకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేసామని, రియాక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా వారకు తక్కువగా ఉన్నాయని, ఒక వేళ వచ్చిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించడం కోసం మెడికల్ సెంటర్లను అందుబాటులో ఉంచామని చెప్పారు. కోట్ల మందికి ప్రాణదానం చేసిన పెన్సిలిన్ సైతం ముందుగా పరీక్ష చేసిన తరువాతనే ఇస్తారని, భయపడవద్దని కరోనాను రాష్ట్రం నుండి తరిమికొట్టడానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యె బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అర్డిఒ రవి, జడ్పిటిసి ఇందిరా లక్ష్మీనరసయ్య, మండల పార్టీ అధ్యక్షులుశక్కరి కోండ కృష్ణ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ నరసయ్య, పిఎసిఎస్ సొసైటీ చైర్మన్లు గజవాడ జైపాల్, శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ రాధాకృష్ణారెడ్డి, సర్పంచులు గణేష్, వెంకటేష్, జగదీశ్, ఎంపీటీసీలు రవి, గణేష్, సాయిలు, తహసిల్దార్ వేణు గోపాల్ గౌడ్, ఎంపిడిఓ మర్రి సురేందర్, ఎంపిడిఓ రామకృష్ణ, వైద్యాధికారి బాబురావు, నర్సయ్య, నల్లవెల్లి సాయిలు, సీనియర్ నాయకులు పద్మారావు, పులి వెంకటేశ్వరరావు, యానం పల్లి గోపు గంగాధర్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారాయణ రెడ్డి, వైద్య సిబ్బంది, అధికారులు,కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 Jan,2021 04:18PM