- డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల దీర్ఘకాలిక కోరిక పసుపు బోర్డు- పసుపు మద్దతు ధర ఈ విషయంలో స్థానిక ఎంపీ, బీజేపీ పార్టీ రైతులతో దోబూచులాడుతుందని, గతంలో మాజీ ఎంపీ కవిత రైతులకు హామీ ఇచ్చి రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆమెకు రైతులు గుణపాఠం చెప్పారని అదేవిధంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ఎంపీ, వారి బీజేపీ జాతీయ నాయకులు రాంమాదవ్ లాంటి వారితో బూటకపు హామీలిచ్చి రైతులకు ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన బీజేపీ అభ్యర్థి అరవింద్ రైతుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎంపీగా గెలిచిన తర్వాత కల్లబొల్లి మాటలతో కాలం వెల్లబుస్తు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాడని మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు గురువారం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇదే అంశంపై స్పందించిన ఈ జిల్లా నాయకత్వం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ ఇతర నాయకులు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన పోరాడాలని నిర్ణయించి ఈ నెల 30న ఆర్మూర్ లో ఒకరోజు దీక్షకు సిద్ధమయ్యారని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. ధీర్ఘకాలిక రైతుల పోరాటాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారం కనుగొనే వరకు పోరాడాలని కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక ప్రణాళికలు రచించమని ,అందులో భాగంగానే మా నాయకుడు రేవంత్ రెడ్డి రైతాంగం కొరకు ఆర్మూర్ లో దీక్షకు పూనుకున్నారని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. అంతేకాదు రైతుల మనోభావాలతో గతంలో మాజీ ఎంపీ కవిత, ఇప్పుడు ఎంపీ అరవింద్ ఆటలాడుతున్నరని వెంటనే ఎంపీ అరవింద్ ఇచ్చిన హామీ పై నిలబడి రాజీనామా చేయాలని లేని ఎడల రైతాంగాన్ని మరింత సంఘటితం చేసి వారి పక్షాన నిరంతర పోరాటం చేస్తూ సమస్య పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని,అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పసుపు రైతుల కొరకు అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి కమ్మర్ పల్లి లో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటుచేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అప్పటి ఎంపీ మధుయాష్కీదే అని మానాల మోహన్ రెడ్డి గుర్తు చేశారు.అదే విధంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో మార్క్ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయించి మార్కెట్లో పసుపు ధర పెరిగే విధంగా కృషి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, నిరంతరం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన పోరాడుతూనే ఉంటుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ నెల 30న జరిగే రైతు దీక్షకు ప్రజలు, రైతులంతా హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడికి సహకరించాలని జిల్లా ప్రజలను మానాల మోహన్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో పి సి సి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, రూరల్ ఇన్చార్జి భూపతి రెడ్డి, అర్బన్ ఇంచార్జ్ తాహెర్బిన్ హందాన్, పీసీసీ కార్యదర్శి నగేష్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విగ్నేష్ యాదవ్, ఎన్ఎఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామర్తి గోపి, ఎన్ఎఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి విపుల్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ జావిద్ అక్రమ్, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, పిసిసి డెలికేట్ మహమ్మద్ ఈసా, నగర మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఏజాజ్, ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు వరుణ్ ,ప్రధాన కార్యదర్శులు వేద మిత్ర, నరందీప్ (చింటూ),దుర్గాప్రసాద్, కార్యదర్శులు చరణ్ ,శశి, సాయి చరణ్ ,అనిల్ కొండ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2021 06:51PM