- కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థలను, వ్యవసాయ రంగాన్ని కట్ట పెడుతున్న మోడీ
- సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు
నవతెలంగాణ కంటేశ్వర్
ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థలను వ్యవసాయ రంగాన్ని కట్టబెడుతున్నారని నరేంద్ర మోడీ విధానాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం కార్మిక కర్షక పోరుయాత్ర మోపాల్ మండల కేంద్రానికి చేరుకున్న అనంతరం అక్కడ కార్మికులను ప్రజలను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ, రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల నీటిని (బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, బ్యాంకులు, రైల్వేలు, విమానయానం, రక్షణ రంగం) ప్రైవేటీకరించడం జరిగిందని అంతటితో కార్పొరేట్ శక్తుల ఆకలి తీరక పోవడంతో వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి రైతులను కూలీలుగా మార్చటానికి మూడు చట్టాలను తీసుకురావడం జరిగిందని వాటిని రద్దు చేయాలని 60 రోజుల నుండి ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు విద్యుత్ చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని విమర్శించారు ప్రజల మధ్య మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి వైషమ్యాలను పెంచుటకు ఉన్నారని నిత్యావసర ధరలు పెరిగిపోతున్న వాటిని అదుపు చేయటం లేదని ఆయన అన్నారు ప్రజా సమస్యల పైన అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు పి రాజారావు, ఎస్ రామ, నూర్జహాన్, పి సూరి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్, ఐద్వా జిల్లా సబ్బని లత, విద్యార్థి సంఘం నాయకులు అనిల్, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2021 06:55PM