నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ భవన్ లో నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కమిటీ 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు. ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పి.సి.సి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, రూరల్ ఇన్చార్జి భూపతి రెడ్డి, అర్బన్ ఇంచార్జ్ తాహెర్బిన్ హందాన్, పీసీసీ కార్యదర్శి నగేష్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ ప్రచార కమిటీ చైర్మన్ జావిద్ అక్రమ్, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, పిసిసి డెలికేట్ మహమ్మద్ ఈసా, నగర మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఏజాజ్ లు పాల్గొన్నారు.అనంతరం వారు ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర కమిటీ ద్వారా నియమించబడ్డ నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు మరియు కార్యదర్శులకు అభినందనలు తెలిపి వారికి సన్మానం చేయడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ నాయకులు విద్యార్థుల సమస్యల పట్ల పోరాడుతూ,అన్ని వేళలా విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యారంగం లోని సమస్యల పరిష్కారానికై అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఇలాగే భవిష్యత్తులో కూడా ముందుకు వెళుతూ విద్యా రంగం మరియు విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగాలని వారు కోరారు అలాగే మీయొక్క పోరాటాలకు అనునిత్యం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల మద్దతు ఉంటుందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు వరుణ్ , ప్రధాన కార్యదర్శులు వేద మిత్ర, నరందీప్ (చింటూ),దుర్గాప్రసాద్, కార్యదర్శులు చరణ్ ,శశి, సాయి చరణ్ ,అనిల్ కొండ, ప్రవీణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2021 07:02PM