- నెలవారి సమీక్ష సమావేశంలో పలు సూచనలు తెలియజేసిన అదనపు డిసిపిలు
నవతెలంగాణ కంటేశ్వర్
మహిళల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వారికి అన్ని రకాల భద్రత విషయంలో ఎల్లప్పుడూ పోలీసులు సహకారం అందించాలని నిజామాబాద్ అదనపు డిసిపి లా అండ్ ఆర్డర్ అరవింద బాబు, అడ్మిన్ ఉషా విశ్వనాథ్ తెలిపారు. ఈ మేరకు గురువారం పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు డిసిపి నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ కు చెందిన అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. నిజామాబాద్ లోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తును ముగించడానికి తగిన సూచనలు తెలియజేశారు.ఇప్పటివరకు జరిగిన నేరాలలో త్వరితగతిన పరిశోధన పూర్తిచేసి పెండింగ్ నేరాల శాతం తగ్గించాలని సూచించారు. ఎటువంటి చిన్న నేరాలు జరగకుండా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయాలని తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని రాత్రి సమయంలో వాహనాలు తనిఖీ చేసి దొంగతనాల నివారణకు కృషి చేయాలని పోలీస్ బీట్ లను ఏర్పాటు చేయాలని తెలియజేశారు.గ్రామాలలో అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు అలవాటుపడిన నేరస్తుల పై పిడియాక్ట్ నమోదు చేస్తామన్నారు. డయల్ 100 ఫిర్యాదుల పట్ల త్వరితగతిన స్పందించాలి అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కోర్టులలో ఉన్న కేసుల త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఎన్ బి డబ్ల్యు ఎస్ లపై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో టీమ్లను ఏర్పాటు చేసి త్వరితగతిన ఎగ్జిక్యూటివ్ చేయాలని సూచించారు మట్కా గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యకలాపాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. లాడ్జి లపై ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు.మోటారు వాహనాల యాక్ట్ ప్రకారం గా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ అన్ని డివిజన్ పరిధిలోని సిఐలు ఎస్ హెచ్ వో లు ఎస్సైలు సీసి అర్బి ఇన్స్పెక్టర్ రాజరాజేశ్వర్ ఎస్సై బాబురావు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2021 07:16PM