- ఉపాధ్యాయుల పెన్షనర్స్ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల ఐక్యవేదిక
నవతెలంగాణ కంటేశ్వర్
23 న నిరసన ప్రదర్శనలను విజయవంతం చేయండి అనిస్టీరింగ్ కమిటీ సభ్యులు నిజామాబాద్ జిల్లా శ్రీకాంత్, రమేష్ ,బాలయ్య, దేవి సింగ్, సుధాకర్, గైక్వాడ్ రామ్ చందర్, విజయ్ కుమార్, శశీతన్, బాలచంద్రశీ, సత్యానంద్, రాజన్న ,సుశీల్ కుమార్ ,రమేష్ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ శాంతన్ లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 23న జిల్లాలోని అన్ని పాఠశాలలో కార్యాలయంలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక జిల్లా స్టీరింగ్ కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. పిఆర్సి సత్వర అమలు, ఇతర సమస్యల పరిష్కారానికి పై నిరసన కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. బోధన్ ఆర్మూర్ డివిజన్ కేంద్రాలలో ఆర్డిఓ కార్యాలయం ముందు, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి నిరసన ప్రదర్శనల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నిజామాబాద్ జిల్లా స్టీరింగ్ కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము. పిఆర్సి నివేదికను వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఈ నెలాఖరులోగా సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ తో1.07.2018 నుండి నూతన వేతనాలు అమలు చేయాలని, 16 మే 2018 న ముఖ్య మంత్రి ఇచ్చిన హామీల అమలుకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి.కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలి.1.09.2004 కు ముందు ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత నియామకమైన ఉద్యోగులు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి అనేే డిమాండ్లతో ఈనెల 23న నిరసన ప్రదర్శనలనుు విజయవంతం చేయాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2021 07:20PM