నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన రైతు ముత్యం రెడ్డి (62) గురువారం తన వ్యవసాయ పొలం వద్ద మూర్ఛ వ్యాధితో మృతి చెందాడు. భార్య నర్మద ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి గురువారం ఉదయం తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పంట పొలం చుట్టూ తిరుగుతుండగా ఒక్కసారిగా మూర్ఛ వ్యాధి రావడంతో వ్యవసాయ పొలంలో పడిపొయాడు. దీంతో శ్వాస ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్డుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2021 07:22PM