- కాంగ్రెస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్
నవ తెలంగాణ కోడంగల్ : దౌల్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం అన్నారు, అధికార టీఆర్ఎస్ నాయకులు ఈ నిబంధనలను పక్కకు నెట్టేసి, ప్రభుత్వ కార్యాలయంను ఎమ్మెల్యే భజన వేదికగా మార్చేశారు అన్నారు, బుధవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని దౌల్తాబాద్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో వేడుకలను నిర్వహించడం, వాటిలో మండల స్థాయి అధికారులు పాల్గొనడం గమనార్హం అన్నారు,ప్రభుత్వ కార్యాలయంలో ఎమ్మెల్యే జన్మదినాన్ని జరుపుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు,
ఎమ్మెల్యే జన్మదినం అనేది తన వ్యక్తిగతం కానీ కొందరు టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలను తమ సొంత ఇలాగ భావించి ఇష్టమొచ్చినట్లు వాడుకోవడం చాలా దారుణమన్నారు, దానికి తోడు అక్కడి అధికారులు ఈ తతంగాన్ని దగ్గరుండి నడిపించడం అనేది ఇది చాలా దారుణమైనదన్నారు. టిఆర్ఎస్ నాయకులారా ఎమ్మెల్యే పై అంత ప్రేమ ఉంటే మీ సొంత బంగ్లాలో నిర్వహిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ పార్టీలకతీతంగా విధులు నిర్వహించే ప్రభుత్వం కార్యాలయాల్లో నిర్వహించడం ఇది ముమ్మాటికి అనైతిక చర్య అన్నారు, ఎంపీడీవో కార్యాలయంలో జన్మదిన వేడుకలను నిర్వహించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో తిరుమలస్వామి ని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2021 08:43PM