- బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ డిమాండ్
నవతెలంగాణ కంటేశ్వర్/ డిచ్ పల్లి
ఇందల్వాయి మండలం యెల్లారెడ్డిపల్లి గ్రామంలో ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులైన
తండ్రి గొల్ల నిన్న ఒడ్డెన్న, తల్లి సాయమ్మ, వదిన గొల్ల పోశవ్వ, మేనత్త గొట్టుముకుల అబ్బవ్వల పై బిజెపి నాయుడు గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్ సంక్రాంతి పండుగ రోజున తాగిన మత్తులో అకారణంగా
దాడి గాయపర్చిన సంఘటనపై పోలీసులు సమగ్రమైన విచారణ జరిపి నిందితుడు శ్రీనివాస్ కు కటిన శిక్షణ పడేవిధంగా సెక్షన్ లు నమోదు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఇందల్వాయి మండలం యెల్లారెడ్డిపల్లి గ్రామంలో దాడికి గురైన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..బిజెపి నాయకడు గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఆర్మీ జవాన్ కుటుంబంపై దాడి చేయడమే కాకుండా తనకు ఎంపీ, బిజెపి నాయకుల అండదండలున్నాయని మీరు ఎవరికి చెప్పకున్న ఎవరు ఏమిచేయరని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి సరైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
మహిళను గాయపర్చి, మరో ఇద్దరు మహిళలపై దాడి చేసిన నిందితుడిపై నాన్ బెయిల్ సెక్షన్ లు నమోదు చేయకుండా ఇందల్వాయి పోలీసులు సాధారణ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు.నిందితుడి నాన్ బెయిల్ కేసులు నమోదు చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులతో ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు.ఈ సమావేశంలో బిఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ జన్నేపల్లి సత్యనారాయణ, బహుజన సాంస్కృతిక ఉద్యమ నాయకులు దర్పల్లి సాయికుమార్, గల్ఫ్ సంఘం జిల్లా నాయకులు జి.విజయ రావు,కుటుంబ సభ్యులు పెద్ద ఒడ్డెన్న, చిన్న ఒడ్డెన్న, ప్రభాకర్ ఇతర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2021 12:58PM