నవతెలంగాణ కంటేశ్వర్ నగరంలోని 17వ డివిజన్ గౌతమ్ నగర్ కమ్యూనిటీ హల్ లో తడిపొడి చెత్త నిర్వహణపై మహిళలకు మెప్మ సిబ్బంది సహకారంతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ శుక్రవారం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్క మహిళ తన ఇంటి నుండే తడిపొడి చెత్త వేరు చేయటకు ముందుకు రావాలని మన రోజు వారి అవసరనుండి వచ్చే చెత్తను తడి చెత్తను ఒక డబ్బాలో పొడి చెత్తను ఒక డబ్బాలో వేరుగా చేయటం ద్వారా ఎరువును తయారు చేయవచ్చని వాటిని మన ఇళ్లలో పెంచే మొక్కలు వాడుకోవచ్చని తెలుపుతూ ఎక్కువ చెత్త ఉంటే దానిని వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకు అందించి చెత్త నిర్ములనకు సహకరించాలని రోడ్లపైన, డ్రైనజీలలో వేయకుండా చూడాలని తెలిపారు తడిపొడి చెత్తను ఒకే దెగ్గర వేయటం ద్వారా కలిగే నష్టాలను ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మాయవార్ సవిత, మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ షోయబ్, సానిటరి ఇంచార్జి ఇన్స్పెక్టర్ ప్రశాంత్, సునీల్, ఆర్.పి శోభ, సి.ఓలు సవిత, హారిక మహిళ సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2021 03:16PM