నవతెలంగాణ - నిజామాబాద్ సిటీ
బీడీ కార్మికులకు కనీస పెన్షన్ ఆరువేల రూపాయలు అమలు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజమాబాద్ నగరంలోని పిఎఫ్ రీజినల్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం పిఎఫ్ రీజినల్ కార్యాలయ ఏవో కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ 1995 చట్ట సవరణ ప్రకారం ఈపీఎఫ్ఓ ట్రస్ట్ బోర్డ్ నుండి 50 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలు నిండిన తదుపరి రాజీనామా చేసిన బీడీ కార్మికులకు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే భవిష్య నిధి సంస్థ ద్వారా చెల్లిస్తున్నారని అన్నారు. నాటి నుండి ఇప్పటివరకు పెన్షన్ పథకం సవరించబడినది లేదన్నారు. బీడీ వృత్తినే నమ్ముకుని బీడీ కార్మికులుగా పనిచేస్తున్న వారికి పని దినాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి బీడీ కార్మికులు అందరికీ పిఎఫ్ పెన్షన్ వర్తింపజేయాలని, ఈపీఎఫ్ ఓ, సంస్థ సెంట్రల్ ట్రస్ట్ బోర్డ్ కమిటీ, కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖ సంయుక్త సమావేశాలలో కనీస పెన్షన్ ఆరువేల రూపాయలు పెంపునకు తీర్మానం చేయాలని, ఈనెల 29 నుండి ప్రారంభమవుతున్న సాధారణ బడ్జెట్ సమావేశాల్లో పిఎఫ్ పెంపుపై నిర్ణయం తీసుకోవాలని లేని ఎడల ఏఐటియుసి ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి.నర్సింగ్ రావు, పి.సుధాకర్, రంజిత్, రఘురాం నాయక్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2021 04:10PM