నవతెలంగాణ- యాలాల
వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీ నారాయణ పూర్ చౌరస్తాలో శుక్రవారం జుంటిపల్లి ప్రాజెక్టు ఆయకట్టుకు అసలు సాగునీరు వదలటం లేదని అక్కంపల్లి ఆయకట్టు దారులు స్థానిక ఎం.పీ.టీ.సి. సభ్యులు కె.మానిక్యమ్మ మల్లప్ప ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. తాండూర్ - కోడంగల్ మార్గంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. రైతుల రాస్తారోకో యాలాల మండల కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షులు, బీమప్ప, జిల్లా కెవిపిస్ అధ్యక్షులు ఉప్పలి మల్కయ్య మద్దతు తెలిపారు. రైతులు ఆగ్రహంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎం.పీ.టీ.సీ. సభ్యులు మానిక్యమ్మ మల్లప్ప మాట్లాడుతూ.. గత ఆరు ఏండ్లుగా చిన్న నీటి పారుదల శాఖ అధికారులు జుంటిపల్లి ప్రాజెక్టు కుడి కాలువ కింద ఆయకట్టు దారులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న తాండూరు రూరల్ ఇన్చార్జి సి.ఐ.రవికుమార్, యాలాల ఎస్.ఐ.అశోక్ బాబు వెంటనే రంగప్రవేశం చేశారు. అక్కంపల్లి రైతుల సాగు నీరు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సి.ఐ. రవికుమార్ చిన్న నీటి పారుదల శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్, సుందర్ తో ఫోన్ లో మాట్లాడాగ, మూడు రోజుల గడువులో అక్కంపల్లి రైతుల పంటల సాగునీరు సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించడంతో అదే విషయాన్ని సిఐ రవికుమార్ రైతులకు చెప్పారు. దీంతో రైతులు రాస్తారోకో కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. 2016, ఆగస్టు నెలలో రూ. 155.75 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేయగ, అప్పటి రాష్ట్ర రవాణా మంత్రి, పట్నం మహేందర్ రెడ్డి ప్రాజెక్టు అభివృద్ధి పనులను శంకుస్థాపన గావించారని గుర్తు చేశారు. పనుల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు మారుతున్నారు కాని ప్రాజెక్టు కుడి కాలువ ఆయకట్టు దారులకు సంపూర్ణంగా సాగునీరు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా సాగునీరు అందక వరినారుమడులు ఎండిపోయాయి అని రైతన్నలు తమ గోడును వెళ్లగక్కుతున్నారు. ఎండిపోయిన వరి నారును చేత పట్టుకొని కన్నీటిపర్యంతం అయ్యారు అన్నధాతలు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, బీమప్ప మాట్లాడుతూ.. జుంటిపల్లి ప్రాజెక్టులో నిండుకుండల సాగు నీరు ఉన్నప్పటికీ, ప్రాజెక్టు కింద అక్కంపల్లి రైతుల పంట పొలాలకు సాగునీరు గత ఆరు సంవత్సరాలుగా కరవైందన్నారు. జిల్లా కెవిపిస్ అధ్యక్షులు, ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ.. తెలంగాణా ప్రభుత్వం రైతులను ఏదోవిధంగా మోసం చేస్తూనే ఉందన్నారు. వెంటనే జుంటిపల్లి ప్రాజెక్టు కింద కుడి, ఎడమ, కాల్వల ఆయకట్టు దారులకు సంపూర్ణంగా సాగునీరు వదలాలి అని పేర్కొన్నారు. అక్కంపల్లి రైతుల సాగు నీటి సమస్యలకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున్న జుంటిపల్లి ప్రాజెక్టు ఆయకట్టు దారుల ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2021 04:23PM