- రంగారెడ్డి జిల్లా ఏఐటియుసి కార్యదర్శి వనం పల్లి జైపాల్ రెడ్డి
నవ తెలంగాణ రాజేంద్రనగర్
కాటేదాన్ పారిశ్రామిక వాడ (TSIIC ) లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన జీతాలను అమలుచేయాలని రంగారెడ్డి జిల్లా ఏఐటియుసి కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జోనల్ కమిషనర్ వినోద్ కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ 2020 నవంబరు నుంచి జీవో నెంబర్ 610 ప్రకారం కార్మికులకు జీతాలు అదనంగా ఇవ్వాల్సి ఉంది అన్నారు. ఇపుడు వస్తున్నా 14 వేల రూపాయలతో పాటు అదనంగా వచ్చే 3 వేల రూపాయలను వెంటనే అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.ఉన్నతాధికారులతో సమీక్షించి కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో (టి.ఎస్.ఐ.ఐ.సి) లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలను పెంచుతామని జోనల్ కమిషనర్ హామీ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2021 07:37PM