నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లోని ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎకడమిక్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న బిఅర్ నేతకు ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ లోని ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డాక్టరేట్ పిహెచ్ డి పట్టాను శుక్రవారం ప్రదానం చేశారు. బీఆర్ నేత ప్రొఫెసర్ పి వెంకట్ రెడ్డి సూపర్ మిషన్లో ఎఫెక్ట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ అండ్ ఫిజియోలాజికల్ వేరియబుల్స్ అమాంగ్ తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్ అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్ డి పట్టా ను పోందరు. ప్రస్తుత కాలంలో ప్రతి మానవుని జీవితంలో ఏరోబిక్ ఏరోబిక్ ట్రైనింగ్ అత్యంత ముఖ్యమైనదని, ప్రతి ఒక్కరు తమ నీ జీవితంలో ఏరోబిక్ టైనింగ్ చేయడం అలవరచుకోవడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారని గుండెకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని దీని ముఖ్య ఉద్దేశం అని ప్రొఫెసర్ వెంకట్ రెడ్డి తెలిపారు.తెలంగాణ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల పై ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ పరిధిలో మొట్టమొదటి సారిగా పరిశోధనలు జరగడం సంతోషకరమని డిన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోఫేసర్ ఎల్ బి లక్ష్మీకాంత్ రాథోడ్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2021 07:40PM