నవ తెలంగాణ కంటేశ్వర్/నవ తెలంగాణ సిటీ
నిజామాబాద్ సుభాష్ నగర్ క్లబ్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా సుభాష్ చంద్ర బోస్ విగ్రహానికి సిపిఐ, ఏ ఐ వై ఎఫ్, డి హెచ్ పి ఎస్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి పి. సుధాకర్ మాట్లాడుతూ నేతాజీ సుభాస్ చంద్రబోస్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చేసిన సేవలను భావితరాలకు గుర్తుండిపోయే విధంగా పాఠ్యాంశాలలో చేర్చాలని తన అడుగుజాడల్లో ఈ దేశ ప్రజానీకం గాని, యువత గాని ముందుండి యువకుల ,ప్రజా సమస్యలపై పోరాడాలని అన్నారు సుభాష్ చంద్రబోస్ మహత్తరమైన వ్యక్తి లేకపోయినా వారి గుర్తులు చిరస్మరణీయమని అన్నారు ఇలాంటి గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నామని
డి.హెచ్.పి.ఎస్ జిల్లా కార్యదర్శి కమలాపురం రాజన్న కోరారు తన గుర్తులు ఎల్లప్పుడు భావితరాల యువత గుర్తు చేస్తూ తన అడుగుజాడలలో నడవాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రంజిత్ మాట్లాడారు ఏఐఎస్ఎఫ్ రఘు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ నేతాజీ ఈ దేశానికి విద్యార్థి లోకానికి ఆదర్శప్రాయుడు అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 03:46PM