- పద్మా నగర్ లో పర్యటించిన నగర మేయర్
- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ శనివారం నగరంలోని గోల్ హనుమాన్ వాటర్ ట్యాంక్ వద్ద గల మున్సిపల్ జోన్2 కార్యాలయన్ని ఉదయం 5 గంటలకు ఆకస్మికంగా వెళ్లి కార్మికుల హాజరును పరిశీలించి, కార్మికులు విధులకు సకాలంలో హాజరు కావాలని విధులను సక్రమంగా నిర్వర్తించి నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం కార్మికులకు అందించిన గ్లౌస్లు, షూస్, మస్కులు ధరించ జాగ్రత్తగా పని చేయాలని సూచించారు.ఈ సందర్భంగా కార్మికులు వారి సమస్యలను దృష్టికి తీసుకురాగ వాటి పరిష్కారాన్ని కృషిచేస్తామని కార్మికులకు భరోసా ఇచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కార్మికులు హాజరు పూర్తయిన తరువాత కార్మికుల దినసరి హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి విధులకు దూరంగా ఉన్న కార్మికులను వెంటనే వచ్చే విధంగా ప్రోత్సహించాలని సూచిస్తూ కార్మికుల విధులను ప్రత్యేకంగా పరిశీలించారు.
అనంతరం నగరంలోని పులాంగ్ ప్రాంతంలో కంపెక్టర్లో చెత్తను నింపుతున్న ప్రాంతాన్ని సందర్శించి ఎక్కడ చెత్త లేకుండా పూర్తిగా శుభ్రం చేయాలని తెలిపి కంపక్టర్ పని, సామర్ధ్యం రోజుకు 6టన్నుల చెత్తను తరలించడానికి ఉపయోగపడుతున్నదని తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఇంటిటి చెత్త సేకరణ ఎలా జరుగుతున్నదో నగరంలోని పద్మ నగర్ కాలనిలో పర్యటించి స్థానికులను చెత్త సేకరణ ఎలా జరుగుతున్నదని అడిగి తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడగా కొన్ని సమస్యలు ప్రస్తావించగా వారిని త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలు కూడా విధిగా తడిపొడి చెత్తను వేరుగా చేసి మున్సిపల్ కార్పోరేషన్ కు సహకరించి స్వచ్ నిజామాబాద్ లో భాగస్వాములు కావాలని కోరారు.నగరంలోని కోటగల్లీలో కార్మికులు మురికి కాలువల శుభ్రం విధిగా చేయాలని కలువలలో దోమల మందును చల్లాలని తెలిపారు. త్రాగు నీరు పట్టుకుంటున్న మహిళలతో మాట్లాడుతూ నీటి సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జోన్2 సానిటరీ ఇంచార్జ్ ఇన్స్ పెక్టర్ ప్రశాంత్, జవాన్లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 03:55PM