నవ తెలంగాణ కంటేశ్వర్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఏ ఐ ఎస్ బి రాష్ట్ర కన్వీనర్ గొల్లపల్లి రాజు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ ఐ ఎస్ బి రాష్ట్ర కన్వీనర్ గొల్లపల్లి రాజు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం లో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివాస్ పేరుతో జరపడం జరుగుతుందన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన విషయాలను బహిర్గతం చేయాలని అలాగే నేతాజీ జయంతి జనవరి 23 తేదీని సెలవు దినంగా ప్రకటించాలని అన్నారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్ శివ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ జయంతిని అధికారికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలని నేతాజీ ఆశయాలను సాధించిన వారం పోతామని అప్పుడు నేతాజీ నిజమైన నివాళులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ బి జిల్లా కన్వీనర్ మహేష్ రెడ్డి రజనీకాంత్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 04:08PM